రైతు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ విశాఖలో ఐద్వా(ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్) మహిళలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. రైతుకు వ్యతిరేకంగా భాజపా ప్రభుత్వం 3 చట్టాలు తీసుకురావటం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తీరు పూర్తిగా కార్పొరేట్ల దోపిడీకి ద్వారాలు తెరిచి రైతుల కడుపు కొట్టే విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భవిష్యత్లో రైతు మనుగడ ఉండదని 130 కోట్ల జనాభాకు ఆహారం అందని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఆహారం కోసం విదేశీయులపై ఆధారపడాల్సి వస్తుందని మండిపడ్డారు. ఇందుకు నిరసనగా పూర్ణమార్కెట్ వద్ద పండా వీధిలో ఐద్వా నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కేంద్రం తన తీరును మార్చుకొని 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.