ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''తహసీల్దార్లపై చర్యలు తీసుకోండి''

విశాఖ మన్యంలోని చింతపల్లి, కొయ్యూరు తహసీల్దార్ కార్యాలయాల ఎదుట గిరిజనులు ఆందోళనకు దిగారు. ధ్రువపత్రాల జారీలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహించారు.

protests-in-front-of-mro-offices-of-chintapalli-and-koyur-in-vishaka-manyam

By

Published : Nov 6, 2019, 1:14 PM IST

చింతపల్లి, కొయ్యూరు తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ఆందోళన

విశాఖ మన్యంలోని చింతపల్లి, కొయ్యూరు మండల తహసీల్దార్లపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైకాపా నాయకులు ఈ ఆందోళనకు నేతృత్వం వహించటం విశేషం. సంబంధిత ఎమ్మార్వోలు గిరిజనులకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహించారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకూ నివాస ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయడం లేదని అంటున్నారు. ఈ మేరకు కొయ్యూరు, చింతపల్లి మండల కార్యాలయాల ఎదుట స్థానికులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పాడేరు సబ్ కలెక్టర్.. ఆందోళనకారులతో చర్చించారు. సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details