విశాఖలో ఐఎఫ్టీయూ కార్మిక సంఘాల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు ప్రతిస్పందనగా ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పేదలకు కరోనా వైద్యం అందించేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ఐ.ఎఫ్.టీ.యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. లాక్డౌన్లో ఉపాధి కోల్పోయిన అసంఘటిత, సంఘటిత కార్మికులందరికీ నెలకి పదివేలు వంతున, ఆరు నెలల పాటు కేంద్ర ప్రభుత్వం చెల్లించాలని వెంకటేశ్వర్లు కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులను రద్దు చేసి పెట్రోల్, డీజిల్‌ను వాస్తవ ధరలకు విక్రయించాలని కోరారు.
విశాఖలో ఇఫ్టూ కార్మిక సంఘాల నిరసనలు - latest vishaka news
విశాఖలోని పలు కూడళ్లలో ఐ.ఎఫ్.టీ.యు కార్మిక సంఘాల నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. లాక్ డౌన్ లో నష్టపోయిన కార్మికులను కేంద్రం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల పై మండిపడ్డారు.
విశాఖలో ఐఎఫ్టీయు కార్మిక సంఘాల నిరసనలు
విశాఖ సీతమ్మధారలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఐ.ఎఫ్.టీ.యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం వెంకటేశ్వర్లు, గాజువాకలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఐ.ఎఫ్.టీ.యు జిల్లా ప్రధాన కార్యదర్శి కే మల్లయ్య, సుజాత నగర్ లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఐ.ఎఫ్.టీ.యు జిల్లా కమిటీ సభ్యుడు సింహాచలం, గోవిందు, పీఓడబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు వెంకట్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఇది చదవండి రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 796 కరోనా కేసులు.. 11 మంది మృతి