ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాడేరులో గిరిజనుల ఆగ్రహం.. ఎన్నికల షెడ్యూల్​ ప్రతులు దగ్దం - local bodies' election schedule latest news update

గిరిజన ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్​కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఏజెన్సీ 11 మండలాల్లో జెడ్​పీటీసీ స్థానాలను ఏడు బీసీలకు, నాలుగు జనరల్స్​కు కేటాయించడంతో పత్రాలను భోగి మంటల్లో వేసి తగలబెట్టారు.

local bodies' election schedule
పాడేరులో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్​కు వ్యతిరేక నిరసనలు

By

Published : Jan 14, 2020, 7:56 PM IST

విశాఖ జిల్లా పాడేరులో గిరిజన ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్​ను నిరసిస్తూ... పాడేరులో గిరిజనులు అందోళన బాటపట్టారు. పాడేరులోని జాయింట్ యాక్షన్ కమిటీ సంఘ సభ్యులు షెడ్యూల్​ పత్రాలను భోగి మంటల్లో వేసి తగులబెట్టారు. విశాఖ ఏజెన్సీలోని 11 మండలాల్లోని జెడ్​పీటీసీ స్థానాలను 7 బీసీలకు, 4 జనరల్స్​కు కేటాయించడంతో గిరిజనులు మండి పడుతున్నారు. ఎక్కువగా గిరిజనులు ఉన్న ఏజెన్సీలో గిరిజనేతరులకు స్థానాలు కట్టబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాడేరులో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్​కు వ్యతిరేక నిరసనలు

ABOUT THE AUTHOR

...view details