కలెక్టర్ బదిలీ నిలిపేయాలని భీమసేన కార్యకర్తల ఆందోళన విశాఖ జిల్లా సంయుక్త కలెక్టర్ శివ శంకర్ బదిలీని వ్యతిరేకిస్తూ భీమ్ సేన ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నాకు దిగారు. మహా విశాఖ నగర పాలక సంస్థ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. నిజాయితీగా పనిచేస్తూ సామాన్య ప్రజలకు అనతి కాలంలోనే దగ్గరైన ఐఏఎస్ అధికారి శివశంకర్‌ను బదిలీ చేయడం మంచిది కాదని భీమసేన కార్యకర్తలు నినాదాలు చేశారు. బడా రాజకీయ వేత్తల భూ కబ్జాల విషయంలో చట్ట ప్రకారం నడుచుకుంటూ ప్రజలకు అనుకూలంగా పనిచేస్తున్నందు వల్లే ఆయనను బదిలీ చేశారని ఆరోపించారు. శివశంకర్ బదిలీని నిలుపుదల చేసి విశాఖలోనే ఉంచాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ: