ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు' - సీఐటీయు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జులై 3వ తేదీన భౌతికదూరం పాటిస్తూ... నిరసనలు చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాలు, ఉద్యోగ ఫెడరేషన్ లు నిర్ణయించాయి.

vishaka district
కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు'

By

Published : Jun 23, 2020, 9:59 AM IST

కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న వేళ లాక్ డౌన్ కారణంగా కార్మికులు ఉపాధి కోల్పోయారని సీఐటీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.జగ్గునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న కార్మికులను, ఉద్యోగులను, సామాన్య ప్రజలను ఆదుకునేందుకు బాధ్యత తీసుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు... ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీలో కార్మికులకు, ప్రజలకు నేరుగా అందిన ఆర్థిక సహాయం ఏమీ లేదని ధివజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details