ఇంటి పన్ను పెంపు నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని అపార్ట్మెంట్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ (వార్వా) డిమాండ్ చేసింది. యూజర్ చార్జీల పేరిట మురుగునీటి పారుదల, తాగునీటి సరఫరాపై ఆర్థిక భారాన్ని పెంచుతున్నారని వార్వా, కాలనీ అసోసియేషన్ సంఘాల ఐక్యవేదిక నాయకులు అన్నారు. విశాఖలోని ఎంవీపీ రైతు బజార్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడారు. రాష్ట్రాలకు అదనపు రుణాలు సమకూరాలంటే పట్టణ సంస్కరణలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయటం దురదృష్టకరమని నివాస్ నాయకుడు బీవీ.గణేశ్ అన్నారు. దానికనుగుణంగా రాష్ట్రప్రభుత్వం ఇంటి పన్నులు పెంచాలనుకోవటం హేయమైన చర్య అని దుయ్యబట్టారు.
ఇంటి పన్నుల పెంపు రద్దు చేయాలని నిరసన.. - protest in visakha news
ఇంటి పన్ను పెంపు నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని విశాఖలోని ఎంవీపీ రైతు బజార్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. విశాఖ అపార్ట్మెంట్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ (వార్వా), కాలనీ అసోసియేషన్ సంఘాల ఐక్యవేదిక (నివాస్) నాయకులు ఈ ఆందోళన చేపట్టారు.
కరోనా ప్రభావంతో ఆదాయాలు లేక, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ సమయంలో పన్నుల పేరుతో ప్రజలపై మరింత భారం వేయటం సరికాదన్నారు. పాత మున్సిపల్ చట్టంలో పేర్కొన్న విలువ ఆధారంగా, ఇంటి స్వభావాన్ని బట్టి పనులు నిర్ణయించాలని కోరారు. పన్నుల భారం పెంచే ప్రతిపాదనకు వ్యతిరేకంగా నగర ప్రజలు జూలై 4వ తేదీ లోగా జీవీఎంసీ కమిషనర్‌కు తమ అభ్యంతరాలను తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. నిరసన కార్యక్రమంలో వార్వా, నివాస్, ఐద్వా నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:అశోక్ గజపతిరాజు గురించి మాట్లాడే అర్హత మీకుందా..?: పల్లా