ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి' - vizag latest news updates

విశాఖ ఆర్కే బీచ్​లో విశాఖ ఉక్కు పరిశ్రమ నిర్వాసితులు ఆందోళన చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

protest in vizag rk beach to appose vizag steel plant privatization
విశాఖ ఆర్కే బీచ్​లో విశాఖ ఉక్కు పరిశ్రమ నిర్వాసితులు ఆందోళన

By

Published : Feb 8, 2021, 7:19 PM IST

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ప్రక్రియను కేంద్రం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ... తెలుగు యువత ఆధ్వర్యంలో ప్లాంటు నిర్వాసితులు ఆర్కే బీచ్​లో ఆందోళన చేపట్టారు. పరిశ్రమలో ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తున్న తమకు... కేంద్ర నిర్ణయం తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం వెంటనే స్పందించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోని పక్షంలో.. ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details