పది, ఇంటర్ పరీక్షల నిర్వహణ రద్దు కోసం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసినట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. తన అభ్యర్థనపై న్యాయస్థానం విచారించిందని.. మే 3కు తదుపరి విచారణను వాయిదా వేసిందని పేర్కొన్నారు. ఫలితంగా మే 3 వరకు తాను చేపట్టిన నిరసన దీక్ష కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆలోచన లేని విద్యాశాఖ మంత్రి ఉన్నాడని.. ఆలోచన ఉంటే ఇలాంటి నిర్ణయం తీసుకోరని మండిపడ్డారు.
మీ అమ్మాయిలైతే ఇలాగే చేస్తారా ?
సీఎం జగన్ కరోనా ఉన్న పరీక్ష గదిలోకి తన కూతుళ్లను పంపిస్తారా అని పాల్ ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థిని, విద్యార్థుల మీద ముఖ్యమంత్రికి బాధ్యత లేదా వారు తన బిడ్డలు కాదా అని నిలదీశారు.