ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్​ అందించాలి' - preotest by tdp leaders at anakapalli news

టీకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. విశాఖ జిల్లా అనకాపల్లిలో తెదేపా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ.. వ్యాక్సిన్​ అందించాలని డిమాండ్​ చేశారు.

protest by tdp leaders
తెదేపా నాయకుల ధర్నా

By

Published : May 8, 2021, 4:50 PM IST

ప్రజలకు కరోనా టీకాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. విశాఖ జిల్లా అనకాపల్లిలో తెదేపా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రజలు కరోనా వల్ల ప్రాణాలు కోల్పోతుంటే.. సీఎం జగన్​ చలనం లేకుండా ఉన్నారని ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు అన్నారు. అన్ని రాష్ట్రాలు టీకాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుంటే.. ముఖ్యమంత్రి మాత్రం కేంద్రంపై ఆధారపడుతున్నారని దుయ్యబట్టారు.

వైరస్​ కారణంగా అధిక సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహమ్మారి బారి నుంచి ప్రజలను రక్షించేందుకు పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ.. టీకా​ వేయించాలని డిమాండ్​ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీతో పాటు తెదేపా రాష్ట్ర కార్యదర్శి బాలాజీ, అర్బన్ జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు సురేంద్ర, పలువురు నేతలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details