ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమ్మడానికి వాళ్లెవరు.. కొనడానికి వీళ్లెవరు? : ఐఎన్‌టీయూసీ నాయకుడు సంజయ్‌ సింగ్‌

త్యాగాలతో వచ్చిన ఉక్కు పరిశ్రమను అమ్మడానికి వాళ్లెవరు.. కొనడానికి వీళ్లెవరు అంటూ ఐఎన్‌టీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంజయ్‌సింగ్‌ విమర్శించారు. విశాఖ బీచ్‌రోడ్డులో ఆదివారం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మహా కవాతు నిర్వహించారు.

steel plant
విశాఖ, స్టీల్ ప్లాంట్

By

Published : Apr 5, 2021, 8:30 AM IST

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆదివారం బీచ్ రోడ్డులో మహాకవాతు

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశాన్ని రద్దు చేయాలని.. బీచ్‌రోడ్డులో ఆదివారం మహా కవాతు నిర్వహించారు. త్యాగాలతో వచ్చిన ఉక్కు పరిశ్రమను అమ్మడానికి వాళ్లెవరు.. కొనడానికి వీళ్లెవరు అంటూ ఐఎన్‌టీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంజయ్‌సింగ్‌ మండిపడ్డారు. కార్మికులు, కార్మిక, ప్రజాసంఘాల నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ నెల 18న విశాఖలో కార్మిక ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేస్తామని సంజయ్‌సింగ్‌ తెలిపారు. రైతు నాయకులు టికాయిత్‌ త్వరలో విశాఖ వస్తారన్నారు.

జాతి ఆస్తిని అమ్మేవాళ్లు.. దేశద్రోహులే: శ్రీధరాచార్యులు

గాజువాక దరి పెదగంట్యాడలో నిర్వహించిన సదస్సులో శ్రీధరాచార్యులు

తరతరాలుగా ఉన్న జాతి ఆస్తిని కాపాడాలే తప్ప.. దానిని అమ్మేస్తే దేశద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతారని సమాచార హక్కు చట్టం జాతీయ పూర్వ కమిషనర్‌ మాడభూషి శ్రీధరాచార్యులు హెచ్చరించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గాజువాక దరి పెదగంట్యాడ బాలచెరువు మీసేవ కేంద్రం మైదానంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఇఫ్టూ) ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఇఫ్టూ జాతీయ కార్యదర్శి పి.ప్రసాద్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.వెంకటేశ్వర్లు, ఉక్కు పోరాట కమిటీ నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:శ్రీవారి ఆలయ నిర్మాణానికి జమ్మూలో 62 ఎకరాలు మంజూరు

ABOUT THE AUTHOR

...view details