ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విశాఖ ఉక్కును కాపాడుకుంటాం.. ఎందాకైనా పోరాడతాం' - protests in visakha

విశాఖ స్టీల్​ ప్లాంట్​ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 72వ రోజుకు చేరుకున్నాయి. ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్ అన్నారు.

protest
ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్

By

Published : Jun 13, 2021, 10:00 AM IST

విశాఖ ఉక్కుతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలన్న కేంద్రం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్ డిమాండ్​ చేశారు. స్టీల్​ ప్లాంట్​ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నగరంలోని గాంధీ విగ్రహం వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 72వ రోజుకు చేరుకున్నాయి. స్టీల్​ ప్లాంట్​ కోసం ఎందరో మహనీయులు త్యాగాలు చేశారని రాజశేఖర్​ గుర్తు చేశారు. రాష్ట్రంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు ఎంతటి పోరాటానికైనా వెనుకాడబోమని స్పష్టం చేశారు.

సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన భాజపా... ఏడు సంవత్సరాల్లో ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేయకపోగా.. ఉన్న వాటిని కార్పొరేట్ పెట్టుబడిదారులకు ధారాదత్తం చేస్తోందని విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి బోగవిల్లి నాగభూషణం, కె.ఈశ్వరరావు, రక్షణ రంగ సంస్థల నాయకులు ఆదిమూర్తి, బి.అప్పలరాజు, శ్యామసుందర్, రవి, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details