ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రేమికుల రోజును ఛీ కొట్టు అమర జవాన్లకు జై కొట్టు' - విశాఖ జనజాగరణ సమితి

పాశ్చాత్య సంస్కృతి అయిన ప్రేమికుల రోజు సంబరాలను వీడి.. అమర జవాన్లకు నివాళులర్పించాలని కోరుతూ జన జాగరణ సమితి కార్యకర్తలు విశాఖలో ఆందోళన నిర్వహించారు.

PROTEST AGAINST VALENTINES DAY IN VIZAG
విశాఖలో ప్రేమికుల దినోత్సవానికి వ్యతిరేకంగా నిరసన

By

Published : Feb 13, 2020, 10:28 PM IST

విశాఖలో ప్రేమికుల దినోత్సవానికి వ్యతిరేకంగా జన జాగరణ సమితి సభ్యుల నిరసన
''ప్రేమికుల రోజును ఛీ కొట్టు అమర జవాన్లకు జై కొట్టు'' అంటూ విశాఖలో జన జాగరణ సమితి కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. గతేడాది ఫిబ్రవరి 14న పుల్వామా దాడి ఘటనలో అమరులైన వీర జవానుల త్యాగాలను మరచి నేటి యువత ప్రేమికుల రోజును జరుపుకోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ విష సంస్కృతిని వీడి సైనికులను స్మరించుకోవాలన్నారు. ప్రేమికుల రోజున మధ్యాహ్నం మూడు గంటలకు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ సైనికులకు నివాళులు అర్పించాలని కోరారు.

ఇదీ చూడండి:

విశాఖ విమానాశ్రయంలో హైజాక్ నిరోధక విన్యాసం

ABOUT THE AUTHOR

...view details