ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రాణవాయువును అందిస్తున్న స్టీల్​ ప్లాంట్​ను ప్రైవేటుపరం చేయొద్దు' - విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వార్తలు

విశాఖలోని గాంధీ బొమ్మ వద్ద అఖిల భారత కార్మిక ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రాణాత్యాగానికి తెగించైనా స్టీల్​ ప్లాంట్​ను కాపాడుకుంటామని కార్మిక నేతలు అంటున్నారు.

protest
రిలే నిరాహార దీక్షలు

By

Published : May 17, 2021, 5:01 PM IST

విశాఖ నగరంలోని గాంధీ బొమ్మ వద్ద అఖిల భారత కార్మిక ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. 46వ రోజు దీక్షలో కార్మికులు, నేతలు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకుంటామని కార్మిక నేతలు అంటున్నారు. కొవిడ్​ బాధితులకు ఆక్సిజన్ అందించి.. ప్రాణాలు కాపాడుతున్న సంజీవిని లాంటి ఉక్కు పరిశ్రమను అమ్మే ఆలోచన.. కేంద్రం మానుకోవాలని నాయకులు డిమాండ్​ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details