తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాలతో విశాఖ తూర్పు నియోజకవర్గ శాసన సభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు తన నివాసంలో నిరసన దీక్ష చేపట్టారు. లాక్డౌన్ సమయంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పేదలను ఆదుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువులను అందించాలని, ప్రతి కుటుంబానికి పదివేలు ఇవ్వాలని, అన్న క్యాంటీన్లను తెరవాలని డిమాండ్ చేశారు.
'ప్రతి పేద కుటుంబానికి రూ.పది వేలు ఇవ్వాలి' - విశాఖపట్నంలో దీక్ష
రాష్ట్ర ప్రభుత్వం విధానాలకు నిరసనగా విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నిరసన చేపట్టారు. ప్రతి ఒక్క పేద కుటుంబానికి రూ.పది వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

తెదేపా నేత వెలగపూడి రామకృష్ణబాబు నిరసన దీక్ష