వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని.. రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి నిరసన చేపట్టారు. జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద మౌన దీక్ష చేస్తూ ఆందోళన చేశారు. మద్యం దుకాణాలకు లేని కరోనా ఆంక్షలు.. వినాయక మండపాలకు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. వినాయక చవితి పండుగకు ఆంక్షలు విధించడమంటే.. హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా వెళ్లడమేనని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు అన్నారు. జగన్ పాలనలో అంతా నాశనమే అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వినాయకచవితి ఉత్సవాలకు అనుమతి కోరుతూ నిరసనలు - vinayaka chavithi festival
వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని విశాఖలో సాధు పరిషత్ సభ్యులు, భాజపా నేతలు ఆందోళన చేశారు. మద్యం దుకాణాలకు లేని కరోనా ఆంక్షలు.. వినాయక మండపాలకు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు.
వినాయకచవితి ఉత్సవాలకు అనుమతి కోరుతూ నిరసనలు