ప్రభుత్వ అధికారులు బలవంతపు భూసేకరణ చేపడుతున్నారని ఆరోపిస్తూ... సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులు విశాఖ జిల్లా అనకాపల్లిలో నిరసన చేపట్టారు. మండల పరిధిలోని 14 గ్రామాల్లో సుమారు 1400 ఎకరాలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది రైతులకు భూములివ్వటం ఇష్టం లేకపోయినా.. బలవంతంగా భూసేకరణ చేపట్టారని ఆరోపించారు. పేదలకు నిజంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటే బడాబాబుల చేతిలో కబ్జాకు గురైన వేల ఎకరాలను స్వాధీనం చేసుకొని ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సీపీఎం నాయకులు సూచించారు. అలాగే ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 72ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
భూసేకరణకు వ్యతిరేకంగా అనకాపల్లిలో రైతుల నిరసన - భూసేకరణకు వ్యతిరేకంగా విశాఖలో నిరసన
బలవంతపు భూసేకరణనను నిరసిస్తూ...విశాఖ జిల్లా అనకాపల్లిలో రైతులు సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 72ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
![భూసేకరణకు వ్యతిరేకంగా అనకాపల్లిలో రైతుల నిరసన భూసేకరణకు వ్యతిరేకంగా అనకాపల్లిలో నిరసన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6023507-690-6023507-1581335834460.jpg)
భూసేకరణకు వ్యతిరేకంగా అనకాపల్లిలో నిరసన