ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో నిరసనలు - పౌర సవరణ బిల్లుపై ఆంధ్రప్రదేశ్​లో నిరసనలు

పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రమయ్యాయి. తిరుపతి, విశాఖ, కర్నూలు, కడప జిల్లాల్లో చట్టాన్ని వ్యతిరేకిస్తూ ముస్లింలు నిరసన చేపట్టారు. వీరి ఆందోళనకు వామపక్షాలు సైతం మద్ధతునిచ్చాయి. ఆర్టీసీ బస్టాండ్​ల్లో నిరసన చేపట్టగా.. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

protest-againest-cab-nrc-bill-and-bjp-in-kadapa-thirupathi-kurnool-visakhapatnam
తిరుపతి, విశాఖ, కర్నూలు, కడప జిల్లాల్లో పౌర నిరసన సెగ

By

Published : Dec 19, 2019, 1:40 PM IST

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింల నిరసన

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతి, విశాఖపట్నంలో ముస్లిం మైనార్టీ సంఘాలు ఆందోళన నిర్వహించారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట బైఠాయించారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేతలు కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. వీరి ఆందోళనకు వామపక్షాలు సీపీఐ, సీపీఎం పార్టీలు మద్దతిచ్చాయి. ముస్లింలను ఈ దేశం నుంచి వెళ్లగొట్టాలని కుటిల ప్రయత్నంలో భాగంగా... మోదీ సర్కార్ తీసుకున్న అమానుష చర్యగా పౌరసత్వ సవరణ బిల్లు నిలుస్తుందని వామపక్షాలు ఆరోపించాయి.

రోడ్లపై భైఠాయింపు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకిస్తూ.. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికేరలో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్థానిక బస్టాండ్​లో నిరసనకు దిగారు. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోనూ వామపక్షాలు, ముస్లిం సోదరులు స్థానిక పాత బస్టాండ్ వద్ద నిరసన చేపట్టారు. రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టడం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చట్టాన్ని రద్దు చేయకుంటే ఆందోళన తీవ్రం చేస్తామని ముస్లిం సంఘాల నేతలుహెచ్చరించారు.

ఇదీ చదవండి:

అవగాహన లేక 'పౌర' చట్టంపై విపక్షాల నిరసనలు

ABOUT THE AUTHOR

...view details