రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను (పీఏసీఎస్) విస్తరించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు... విశాఖపట్నం జిల్లా చోడవరం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పీఏసీఎస్‌ల మాజీ అధ్యక్షులు, వైకాపా నాయకులతో సమావేశమయ్యారు. ప్రస్తుతం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఉన్న 21 పీఏసీఎస్‌లకు అదనంగా మరో ఏడు పీఏసీఎస్‌లు ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే ధర్మశ్రీ తెలిపారు.
చోడవరంలో పీఏసీఎస్‌ల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు - vizag district latest news
విశాఖపట్నం జిల్లా చోడవరం మండలంలో మరో ఏడు పీఏసీఎస్‌ల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు స్థానిక ఎమ్మెల్యే ధర్మశ్రీ తెలిపారు. పీఏసీఎస్‌లను విస్తరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ చర్యలు చేపట్టారు.
చోడవరంలో పీఏసీఎస్‌ల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు
రోలుగుంట మండలంలో వడ్డిప, జె.నాయుడుపాలెం, బుచ్చయ్యపేట మండలంలో రాజాం, పెదమదీనా రావికమతంలో తట్టబంద, చోడవరం మండలంలో వెంకన్నపాలెం, గౌరీపట్నం గ్రామాల్లో కొత్త పీఏసీఎస్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
ఇదీచదవండి.