రాష్ట్రంలో విద్యుత్తు టారిఫ్ పై మూడు రోజుల బహిరంగ విచారణ ముగిసింది. విశాఖలోని ఈపిడిసిఎల్ ప్రధాన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా రాష్ట్రంలోని వివిధ కార్యాలయాల నుంచి పలువురు రైతు సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, వినియోగదారులు దాదాపు 60 మంది తమ అభిప్రాయాలను వెల్లడించారు. వరుసగా మూడోరోజు కూడా కొనసాగిన ఈ విచారణలో విద్యుత్తు నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి, ఇతర సభ్యులు రాంసింగ్ ఠాకూర్, రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. వ్యవసాయ విద్యుత్తు మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ పలువురు కమిషన్ ముందు తమ అభ్యంతరాలను వివరించారు. నిర్ణీత సమయంలో టారిఫ్ ఆర్దర్ ను ఇస్తామని ఛైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి వివరించారు. విద్యుత్తు ఛార్జీల పెంపుదల ప్రతిపాదనలే డిస్కాంల నుంచి లేనందున ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని వివరించారు.
విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనపై మెజార్టీ అభిప్రాయమిదే.. - ఏపీ ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ
రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై ఏపీ ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ ముగిసింది. మూడు రోజల బహిరంగ విచారణ అనంతరం కమిషన్ చైర్మన్ జస్టిస్ నాగార్జున్ రెడ్డి మాట్లాడారు. విద్యుత్ చార్జీల పెంపుపై డిస్కంల నుంచి ప్రతిపాదనలు లేనందున ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు.
విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదన