డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(డీసీఐ) కంపెనీకి ఎండీ, సీఈవోగా ప్రొఫెసర్ డా.జీవైవీ విక్టర్ నియమితులయ్యారు. గతంలో డీసీఐ ప్రభుత్వరంగ సంస్థగా ఉండేది. నాలుగు మేజర్ పోర్టుల కన్సార్టియం భాగస్వామ్యంలో లిమిటెడ్ కంపెనీగా మారిన తర్వాత ఇదే తొలి నియామకం.
విశాఖపట్నం, పారదీప్, జవహర్ లాల్ నెహ్రూ, దీన్‌దయాళ్ పోర్టు ట్రస్ట్‌ల కన్సార్టియంల నిర్వహణ ఇప్పుడు డీసీఐ చూస్తోంది. విక్టర్ తొలి డీసీఐ కేడెట్. 1991లో డ్రెడ్జింగ్ కేడెట్‌గా ఉద్యోగాన్ని ఆరంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి డీసీఐఎల్ ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. పలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయ సంస్థలతో కలిసి పనిచేసిన అనుభవం విక్టర్‌కి ఉంది.