విశాఖలోని బీచ్ రోడ్డులో లూలూ మాల్‌కు కేటాయించిన భూములను అమ్మే విషయంపై హైకోర్టు స్టే ఇవ్వటం హర్షించదగిన విషయమని ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక అధ్యక్షుడు, యూపీఎస్సీ మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్.కె.ఎస్ చలం అన్నారు. ఎన్నో ఏళ్లుగా వస్తున్న ప్రజల ఆస్తిని అమ్మే హక్కు ఏ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.
ప్రజా సంక్షేమం పేరుతో చేస్తున్న అక్రమ అమ్మకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో సర్ ప్లస్ భూములు లేవని.. గత ప్రభుత్వాలే వేల ఎకరాల్లో అమ్మేశాయని గుర్తు చేశారు. ప్రభుత్వాలు సొంతంగా సంపద సృష్టించాలే కానీ.. ప్రజల సంపదను అమ్మడం ఎంత మాత్రం సరికాదని హితవు పలికారు.