ks Ramarao on AP Govt: ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమలో జోక్యం చేసుకుందని ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే రాబడిని బట్టి నిర్మాతలు ఇక నుంచి బడ్జెట్ నిర్ణయించుకోవాలని సూచించారు. గత ప్రభుత్వంలో సినీ పరిశ్రమకు సంబంధించిన పనులు త్వరితగతిన జరిగేవన్నారు. ఇప్పుడు జాప్యం జరుగుతోందని వ్యాఖ్యానించారు.
" తెలుగు సినీ పరిశ్రమపై... వైకాపా ప్రభుత్వం తీరు మార్చుకోవాలి" - Producer ks Rama rao comments on AP Government
ks Ramarao on AP Govt: ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏపీ ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమలో జోక్యం చేసుకుంటోందని ప్రముఖ నిర్మాత కెఎస్. రామారావు అన్నారు. ఇక నుంచి నిర్మాతలు రాబడిని బట్టి బడ్జెట్ నిర్ణయించుకోవాలన్నారు. లేకుంటే నష్టపోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయని తెలిపారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
![" తెలుగు సినీ పరిశ్రమపై... వైకాపా ప్రభుత్వం తీరు మార్చుకోవాలి" ks Ramarao on AP Govt](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14758591-769-14758591-1647510144065.jpg)
విశాఖలో ఉన్న ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ అధ్యక్షుడిగా ఉన్న తనపై.. తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1250 మంది సభ్యులున్న విశాఖ ఎఫ్ఎన్సీసీ రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. విశాఖలో సినీ పరిశ్రమకు దోహదపడాలనేదే తన ఉద్దేశమని తెలిపారు. ప్రైవేటు వ్యక్తికి చెందిన స్థలంలో లీజు విధానంలో విశాఖ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ కొనసాగుతోందని తెలిపారు. ప్రభుత్వ సహాయం కోసం ఫిల్మ్‌నగర్ ఎదురుచూస్తోందని కె.ఎస్.రామారావు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:JC Prabhakar Reddy: తాడిపత్రిలో హోలీ సంబరాలు... జేసీ స్టెప్పులు