ప్రైవేట్ విద్యా సంస్థలలో పనిచేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ చోడవరంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకుల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు నిరసన చేపట్టినట్లు సంఘ నియోజకవర్గ అధ్యక్షుడు డా. ఎం.వి.ఎస్.మూర్తి తెలిపారు. ఈ ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు. నాలుగు నెలలుగా జీతాలు లేక కుటుంబ పోషణ కష్టమైపోతుందని వారు వాపోయారు. ప్రభుత్వం దయతో ముందుకొచ్చి ఆదుకోవాలని కోరారు. నిరసనలో తమ సమస్యలను తెలిపే ప్లకార్డులను ప్రదర్శించారు.
ప్రభుత్వం ఆదుకోవాలని ప్రైవేట్ టీచర్ల నిరసన - latest updated news in chodavaram
రాష్ట్రంలో గత నాలుగు నెలల నుంచి జీతాలు రాక ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ విద్యా సంస్థలలో పనిచేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ వారు చోడవరంలో నిరసన కార్యక్రమం చేశారు.

చోడవరంలో ప్రైవేట్ టీచర్స్ నిరసన