టీచర్ల బదిలీలకు ముందుగానే ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్ లుగా పదోన్నతులు కల్పిస్తున్నారు. ఈ మేరకు విశాఖ జిల్లాలో 301 ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించి ధ్రువపత్రాల పరిశీలన కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే పదోన్నతులు పోందిన వారు పని చేసే ప్రాంతాన్ని ఇప్పుడు ఎంచుకునే అవకాశం లేదు. దాని కోసం బదిలీలన్నీ పూర్తయ్యే వరకు వీరు నిరీక్షించాల్సి ఉంటుంది. బదిలీలు పూర్తయ్యక మిగిలిన ఖాళీలను వీరికి కేటాయించడంతో చాలామంది ఉపాధ్యాయులు ్ద్యోగొన్నతలను వదులు కుంటున్నారు.
బదిలీలకు ముందే ఎస్జీటీలకు పదోన్నతులు - SGT counciling in vishaka
ఉపాధ్యాయుల బదిలీలకు ముందుగానే ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్ లుగా పదోన్నతులు కల్పిస్తున్నారు. ఈ మేరకు సంబంధిత ధ్రువపత్రాల పరిశీలన కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే పదోన్నతులు పోందిన వారు పని చేసే ప్రాంతాన్ని ఇప్పుడు ఎంచుకునే అవకాశం లేదు. దాని కోసం బదిలీలన్నీ పూర్తయ్యే వరకు వీరు నిరీక్షించాల్సి ఉంటుంది.
ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్ లుగా పదోన్నతులు
పదోన్నతుల్లో ఎప్పటిలాగే భాషా పండితులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఆ వర్గం ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. జీవో నెంబర్ 77 ను రద్దు చేసి భాషా పండితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1340 మంది భాషా పండితులకు జీతాలు ఒకచోట పనిచేసేది మరొకచోట కావడంతో ప్రతి నెల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండీ...ఏపీపీఆర్ ఇంజినీరింగ్ ఐకాస ఆధ్వర్యంలో నిరసన