MODI PUBLIC MEETING AT VISAKHA : ఆంధ్రా యూనివర్శిటీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న మోదీ.. తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. కొన్ని నెలల కిందట అల్లూరి జయంతి వేడుకలకు వచ్చే సౌభాగ్యం కలిగిందని తెలిపారు. భారత్‌కు విశాఖపట్టణం ప్రత్యేకమైన నగరమని ప్రధాని అభివర్ణించారు. ప్రాచీనకాలం నుంచి విశాఖ పోర్టుకు ఘన చరిత్ర ఉందన్న మోదీ.. ఎన్నో ఏళ్లుగా ప్రముఖ వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతోందని వ్యాఖ్యానించారు. వెయ్యేళ్ల క్రితమే పశ్చిమాసియా, రోమ్‌కు విశాఖ నుంచి వ్యాపారం జరిగేదని తెలిపారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హరిబాబు ఎప్పుడు తనని కలిసినా ఏపీ అభివృద్ధిపైనే అడుగుతారని తెలిపారు.
"ప్రాచీనకాలం నుంచి విశాఖ పోర్టుకు ఘన చరిత్ర ఉంది. ఎన్నో ఏళ్లుగా ప్రముఖ వ్యాపార కేంద్రంగా విశాఖ విరాజిల్లుతోంది. వెయ్యేళ్ల క్రితమే పశ్చిమాసియా, రోమ్‌కు విశాఖ నుంచి వ్యాపారం జరిగేది. ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రా ప్రజలు తమ ప్రతిభను చాటుతున్నారు. వైద్యం, వ్యాపారం, సాంకేతిక రంగాల్లో ఏపీ ప్రజలు రాణిస్తున్నారు. విశాఖ రైల్వేస్టేషన్‌తో పాటు పోర్టును ఆధునీకరిస్తున్నాం. బహుముఖ రవాణా వ్యవస్థ దిశగా విశాఖ ముందడుగు వేస్తోంది. విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ, అభివృద్ధికి అడుగులు. మిషన్ గతిశక్తి కింద ప్రాజెక్టుల్లో వేగం పెంచాం"-ప్రధాని మోదీ
ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రా ప్రజలు తమ ప్రతిభను చాటుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. వైద్యం, వ్యాపారం, సాంకేతిక రంగాల్లో ప్రజలు రాణిస్తున్నారన్నారు. వికసించిన భారత్ అనే అభివృద్ధి మంత్రంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. సమ్మిళిత అభివృద్ధే తమ ఆలోచన అని ప్రధాని తెలిపారు. మౌలిక సదుపాయాలతో ఆధునిక భారత్‌ను ఆవిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. రైల్వే, రోడ్లు, పోర్టుల అభివృద్ధిలో తాము ఎప్పుడూ సందేహించలేదని తెలిపారు. శాఖ రైల్వేస్టేషన్‌తో పాటు పోర్టును ఆధునీకరిస్తున్నామన్నారు. బహుముఖ రవాణా వ్యవస్థ దిశగా విశాఖ ముందడుగు వేస్తోందని వ్యాఖ్యానించారు. మిషన్ గతిశక్తి కింద ప్రాజెక్టుల్లో వేగం పెంచామని పేర్కొన్నారు.
"ఇవాళ ప్రతి దేశం ఏదో ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సంక్షోభంలో ఉన్న ప్రతి దేశం నేడు భారత్ వైపు చూస్తోంది. వెనుకబడిన జిల్లాల్లో అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాం. పేదలకు ఉచితంగా బియ్యం అందిస్తున్నాం. పీఎం కిసాన్ ద్వారా రైతుల ఖాతాల్లో నిధులు వేస్తున్నాం. పేదలకు మరిన్ని పథకాలు విస్తరిస్తున్నాం. మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఉపయోగపడుతున్నాయి"-ప్రధాని మోదీ
సామాన్య మానవుడి జీవితం మెరుగుపరచడమే తమ లక్ష్యమని ప్రధాని పేర్కొన్నారు. ఇవాళ ప్రతి దేశం ఏదో ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్న ప్రధాని.. సంక్షోభంలో ఉన్న ప్రతి దేశం నేడు భారత్ వైపు చూస్తోందని వ్యాఖ్యనించారు. వెనుకబడిన జిల్లాల్లో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని.. ఉచితంగా బియ్యం ఇస్తున్నట్లు తెలిపారు. పీఎం కిసాన్ ద్వారా రైతుల ఖాతాల్లో నిధులు వేస్తున్నామన్నారు. మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఉపయోగపడుతున్నాయన్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ, అభివృద్ధికి అడుగులు వేస్తున్నట్లు తెలిపారు.
ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలివే..
- రూ.2,658 కోట్లతో శ్రీకాకుళం-అంగుల్ నేచురల్ గ్యాస్ పైపులైన్ (745కి.మీ.)
- రూ. 3,778 కోట్లతో రాయపూర్-విశాఖ ఎకనామిక్ కారిడార్‌లో 6 లేన్ల గ్రీన్ ఫీల్డ్ రహదారి,
- విశాఖ ఎన్‌హెచ్-516సిపై కాన్వెంట్ జంక్షన్-షీలానగర్ జంక్షన్ వరకు 6 లేన్లు,
- రూ. 566 కోట్లతో విశాఖ పోర్టు కనెక్టివిటీ కోసం అదనంగా 4 లేన్ల డెడికేటెడ్ పోర్టు రోడ్డు,
- రూ.152 కోట్లతో విశాఖ ఫిషింగ్ హర్బర్ ఆధునికీకరణ,
- రూ.460 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధికి ప్రధాని శంకుస్థాపన
- ఓఎన్‌జీసీ-యుఫీల్డ్ ఆన్‌షోన్ సదుపాయాలు జాతికి అంకితం