ఎలమంచిలిలో మిన్నంటుతున్న నిత్యావసరాల ధరలు - విశాఖ జిల్లాలో నిత్యావసర ధరలు
విశాఖ జిల్లా ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో హోల్సేల్ వ్యాపారులు సరకులను బయటకు రాకుండా నిల్వచేయడంతో నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతున్నాయి. అధికారులు దుకాణాలపై నిఘా వేసి ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఎలమంచిలిలో మిన్నంటుతున్న నిత్యావసరాల ధరలు
విశాఖ జిల్లా ఎలమంచిలి మున్సిపాలిటీలో నిత్యావసర సరకుల ధరలు మిన్నంటుతున్నాయి. వ్యాపారులు సరకులు బయటకు రానివ్వకుండా నిల్వచేయడంతో బియ్యం బస్తా ధర 100 నుంచి 200 రూపాయల వరకు పెరిగింది. అలాగే వంట నూనె, చింతపండు ధరలు పెరిగాయి. రాబోయే రెండు నెలల్లో సరకులు రావని ఉన్న సరకు నిల్వ చేస్తే అధిక ధరలకు అమ్ముకోవచ్చని హోల్సేల్ వ్యాపారులు యోచిస్తున్నారు. అమ్మకాలు మానేసి షాపులు మూసేస్తున్నారు. ఫలితంగా ఎలమంచిలి ప్రజలు అధిక ధరలకు నిత్యావసర వస్తువుల కొనుక్కోవాల్సి వస్తోంది.