'విలేకరుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది' - విశాఖ జిల్లా
విలేకరుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించారని చెప్పారు.
చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ
విశాఖ జిల్లా చోడవరంలో ప్రెస్ క్లబ్ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ హాజరయ్యారు. విలేకరుల సంక్షేమానికి జగన్ నాయకత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె అన్నారు. అనంతరం ఎమ్మెల్యేను జర్నలిస్టులు సత్కరించారు.
ఇవీ చదవండి...ప్రజాసంక్షేమం కోసం.. పోరాడుతూనే ఉంటా: చంద్రబాబు