Navy Day Celebrations: విశాఖలో నౌకాదళ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమెతో పాటు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సభాపతి తమ్మినేని సీతారాం, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు అమర్నాథ్, రజిని, నౌకాదళ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా నౌకాదళ సిబ్బంది ధైర్యసాహసాలను రాష్ట్రపతి ప్రత్యేకంగా ప్రశంసించారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు నౌకాదళం సిద్ధంగా ఉందని... ఈ విభాగం బలోపేతం కావడం మనందరికీ గర్వకారణమన్నారు.
కర్నూలు జిల్లాలో 3వేల ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఎన్ఓఆర్ తోపాటు... ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను రాష్ట్రపతి ప్రారంభించారు. రాయచోటి, అంగళ్లు మధ్య జాతీయ రహదారి పనులకు శ్రీకారం చుట్టారు. జాతీయ రహదారుల విస్తరణ దేశ ప్రగతి సూచికగా రాష్ట్రపతి అభివర్ణించారు. గిరిజన విద్యార్థుల ఉన్నతికి ఏకలవ్య పాఠశాలలు దోహదం చేస్తాయన్నారు. కర్నూలులో చేపడుతున్న ప్రాజెక్టుతో... రక్షణశాఖ పరీక్షా సామర్థ్యం మరింత పెరిగిందని అభినందించారు.