ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోడు భూముల పట్టాల పంపిణీకి స్వరం సిద్ధం- ఐటీడీఏ అధికారి వెంకటేశ్వర్ - పోడు భూముల పట్టాల పంపిణీపై వార్తలు

విశాఖ జిల్లాలో పోడు భూముల పట్టాల పంపిణీకి స్వరం సిద్ధమైందని ఐటీడీఏ అధికారి వెంకటేశ్వర్ తెలిపారు. ఏజెన్సీ గిరిజనులే కాకుండా అనకాపల్లి నర్సీపట్నం షెడ్యూల్ ఏరియాలోనూ పోడు భూములకు పట్టాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

Prepare the tone for the distribution of land documents at vishaka
పోడు భూముల పట్టాల పంపిణీ

By

Published : Oct 1, 2020, 10:10 AM IST

గిరిజన ప్రాంతంలో సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలిచ్చే కార్యక్రమాన్ని సీఎం జగన్ అక్టోబర్ 2న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. విశాఖ జిల్లాలో పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇచ్చేందుకు ఐటీడీఏ రంగం సిద్ధం చేసిందని ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఏజెన్సీ గిరిజనులే కాకుండా అనకాపల్లి నర్సీపట్నం షెడ్యూల్ ఏరియాలోనూ పోడు భూములకు పట్టాలు ఇస్తున్నట్లు తెలిపారు.

గత పదేళ్ల కాలంలో ముప్పై ఎనిమిది వేల మందికి మాత్రమే అటవీ భూమి హక్కుల చట్టం ద్వారా లబ్ధి పొందారని.. ఈ ఒక్క ఏడాదిలోనే 48 వేల 53 మందికి పట్టాలు అందిస్తున్నట్లు పీవో వెల్లడించారు. ఈ పట్టాల ద్వారా రైతు భరోసా ఇతర రుణ సదుపాయం పొందవచ్చన్నారు. రైతులకు పూర్తి హక్కులు కలుగుతాయని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు.

ఇదీ చదవండి: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు ఇవే

ABOUT THE AUTHOR

...view details