విశాఖలో ఓ గర్భవతికి 23 వారాల వ్యవధిలోనే జన్మించిన శిశువు... సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు మెడికవర్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ శిశువు రాష్ట్రంలో జన్మించిన 'మోస్ట్ ప్రీ మెచ్యూర్ బేబీ' అని వారు వెల్లడించారు. శిశువు పుట్టిన సమయంలో కేవలం 420 గ్రాముల బరువు మాత్రమే ఉందని... అవయవాలు ఏమాత్రం ఎదుగుదల లేకుండా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం శిశువు 1.75 కిలోలు ఉందని వైద్యులు తెలిపారు
గత రెండు నెలలుగా ఆ చిన్నారికి ప్రత్యేక వైద్య సేవలు అందించామని.. ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగానే ఉందని వైద్యులు తెలిపారు. శిశువు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.