విశాఖ నగరంలోని శ్రీ ప్రేమ సమాజానికి 1971లో దేవాదాయశాఖ చట్టం నుంచి కల్పించిన పలు మినహాయింపులను రద్దు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అది దేవాదాయశాఖ నియంత్రణలోకి వచ్చినట్లయింది. దీని నిర్వహణపై ఫిర్యాదులు రావడంతో దేవాదాయశాఖ సహాయ కమిషనర్ విచారణ జరిపి నివేదిక ఇచ్చారు. అనాథ పిల్లలు, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవడం లేదని, రూ.1.2కోట్లతో నిర్మించిన భవనం, ప్రహరీ, గోవుల షెడ్డు నిర్మాణానికి సరైన అనుమతులు తీసుకోలేదని, పలు నిబంధనలు పాటించలేదని ఆ నివేదికలో పేర్కొన్నారు.
దేవాదాయశాఖ పరిధిలోకి శ్రీ ప్రేమ సమాజం - విశాఖ ప్రేమ సమాజం వార్తలు
దేవాదాయశాఖ పరిధిలోకి శ్రీ ప్రేమ సమాజం చేరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు.
దేవాదాయశాఖ పరిధిలోకి శ్రీ ప్రేమ సమాజం