ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ మన్యంలో... ఆగని డోలీ మోతలు - విశాఖ మన్యంలో ఆగని డోలీ మోతలు

విశాఖ మన్యంలో గర్భిణుల డోలీ మోతలు ఆగడం లేదు. మన్యం మొత్తంలో వారానికి ఒకరోజైనా ఏదో ఒక ప్రాంతం నుంచి గర్భిణులను డోలీ ద్వారా గిరిజనులు మోసుకెళ్తున్న పరిస్థితులు కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా పాడేరు కొండ ప్రాంతం నుంచి ఒక మహిళను 5 కిలోమీటర్లు ఇలాగే మోసుకుని ఆసుపత్రికి తరలించారు.

విశాఖ మన్యంలో ఆగని డోలీ మోతలు

By

Published : Sep 11, 2019, 6:54 PM IST

విశాఖ మన్యంలో ఆగని డోలీ మోతలు

విశాఖ మన్యం పాడేరు మండలం వల్లాయి గ్రామానికి చెందిన సూర్యకుమారి నిండు గర్భిణి. ఆమెకు ప్రసవ నొప్పులు రాగా... కుటుంబసభ్యులు మినుములూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సమాచారం అందించారు. ఆ ఊరికి అంబులెన్స్ వెళ్లే మార్గం లేనందున ఆశా కార్యకర్త మరో నలుగురు వ్యక్తుల సహాయంతో డోలీ కట్టారు. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి ఆమెను తీసుకెళ్లారు. రాళ్లురప్పలూ, బురదలో అవస్థలు పడుకుంటూ గర్భిణిని మోసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె మినుములూరులో వైద్య సేవలు పొందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details