విశాఖ జిల్లాలోని పాడేరు మారుమూల గ్రామాల్లో గర్భిణీలకు అష్టకష్టాలు తప్పడం లేదు. బిడ్డకు జన్మనివ్వాలంటే వారిని మోస్తూ వాగులు దాటించాల్సిందే. జి.మాడుగుల మండలం రసరాయిలో ఓ నిండు గర్భిణీకి పురిటి నొప్పులు మొదలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం ఏర్పడింది. కానీ కొండ వాగు పొంగి ప్రవహించడంతో వాహనం రాలేకపోయింది. దీంతో బంధువులు అతి కష్టం మీద ఇలా పల్లకిలో మోసుకెళ్ళి రహదారికి చేర్చారు. అక్కడి నుంచి ప్రైవేటు వాహనంలో జి.మాడుగుల ఆస్పత్రికి తరలించారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా...ఎంత మంది అధికారులు మారినా తమ తలరాతలు మాత్రం మారటం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.
Paderu Agency: వాగు దాటలేక నిండు గర్భిణి అవస్థలు.. పల్లకిలో మోసిన బంధువులు
విశాఖ జిల్లాలోని జి.మాడుగుల మండలం రసరాయిలో ఓ నిండు గర్భిణీకి పురిటి నొప్పులు మొదలయ్యాయి. కొండ వాగు పొంగి ప్రవహించడంతో వాహనాలు రాలేదు. దీంతో బంధువులే పల్లికిలో మోసుకెళ్లారు.
వాగు దాటలేక నిండు గర్భిణి అవస్థలు..పల్లకిలో మోసిన బంధువులు