విశాఖ జిల్లా మన్యంలో పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉంటాయి. పల్లెలకు సరైన రోడ్డు మార్గాలు ఉండని పరిస్థితి. ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పాలకులు పట్టించకునే పాపాన పోరు. అక్కడి ప్రజలు ఎప్పటికీ సమస్యలతో పోరాడుతూనే ఉంటారు. ఇక వర్షాకాలమైతే వారి కష్టాలు వర్ణణాతీతం.
తాజాగా కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇలాంటి సమయంలో జి.మాడుగుల మండలం పెదలోచలి పంచాయతీ చిన్నసంగం గిరిజన ప్రాంతంలో నిండు గర్భిణి కాంతమ్మకు పురిటి నొప్పులు వచ్చాయి. 108 వాహనానికి ఫోన్ చేశారు. కానీ వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో.. గ్రామానికి వచ్చే పరిస్థితి లేదు. ద్విచక్ర వాహనం అంబులెన్స్ కూడా రాలేకపోయింది. దీంతో అతి కష్టం మీద.. ఇంటి వద్దే ప్రసవించింది.