విశాఖ మన్యంలోని జి.మాడుగుల మండలం సరిహద్దు తల్లాబులో బోనంగి రాములమ్మ అనే నిండు గర్భిణీ పురిటి నొప్పులతో బాధపడుతుంటే రోడ్డు సౌకర్యం లేక కొండల మధ్య పది కిలోమీటర్ల మేర డోలీ మోసుకుని మద్ది గరువు రహదారి మార్గం వరకు తీసుకువచ్చారు గ్రామస్థులు. అంబులెన్స్ రాకపోవడంతో స్థానికులు మీడియాకు సమాచారం ఇచ్చారు. ఈటీవీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డీఐజీ దేవుడు బాబు, ఎస్సై ఉపేంద్రలు స్పందించారు. హుటాహుటిన అంబులెన్స్ పంపించారు.
గర్భిణికి డోలీ కష్టాలు... 10 కిలోమీటర్ల పయనం
మన్యంలో గర్భిణిలకు ఇక్కట్లు తప్పడం లేదు. వైద్య సదుపాయాల కోసం నరక యాతన పడుతున్నారు. పురిటి నొప్పులు వస్తే గర్భిణిని డోలీలో మోసుకెళ్లాల్సిందే. రోడ్డు సౌకర్యం లేక కిలోమీటర్ల మేర కొండ మార్గాల గుండా ఓ నిండు గర్భిణీని పది కిలోమీటర్ల మోస్తూ ప్రధాన రహదారి వద్దకు తీసుకొచ్చారు. అయితే అక్కడ అంబులెన్స్ కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈటీవీ సమాచారం ఇవ్వటంతో... పోలీసులు అంబులెన్స్ ఏర్పాటు చేశారు.
గర్బిణికి డోలీ కష్టాలు
ఏదైనా అత్యంత అవసర చికిత్స నిమిత్తం మార్గమధ్యలోని నుర్మతిలో వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. మారుమూల గ్రామాల్లో రహదారులు లేకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: