విశాఖ మన్యంలో బైక్ ఫీడర్ అంబులెన్స్‌లో తరలిస్తుండగా ఓ గర్భిణి ప్రసవించింది. జి. మాడుగుల మండలం బీరం పంచాయతీ తర్మరంగి కొండల్లో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను స్ట్రెచర్‌పై 2 కిలోమీటర్లు మోసుకొచ్చారు. ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో నొప్పులు ఎక్కువ అయ్యాయి. బైక్ అంబులెన్స్ వైద్య నిపుణుడి సహాయంతో గర్భిణికి చికిత్స చేయగా.. ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.
బైక్ అంబులెన్స్‌లో ప్రసవం... తల్లీబిడ్డ క్షేమం - agency areas problme in viskha
విశాఖ మన్యం అంటనే వసతులలేమి... ప్రాణం మీదకొస్తే ఎవరైనా భుజాలమీద వేసుకుని తీసుకెళ్లాల్సిన పరిస్థితి.. అలాంటి ప్రాంతంలో ఓ గర్భిణికి అర్థరాత్రి పురిటినొప్పులు వచ్చాయి. అంబులెన్స్ వెళ్లే మార్గం లేదు. నొప్పులు ఎక్కువ అయ్యాయి. ఆ సమయంలోనే బైక్ ఫీడర్ అంబులెన్స్ ఆ తల్లి ప్రాణాన్ని కాపాడింది. పండంటి బిడ్డకు ఊపిరిలూదింది.
బైక్ అంబులెన్స్‌లో ప్రసవం
Last Updated : Dec 25, 2019, 11:29 AM IST