భారీ వర్షాలకు విశాఖ మన్యంలోని గిరిజనులు తీవ్ర అవస్ఖలు ఎదుర్కొంటున్నారు. సాధారణ సమయాల్లోనే డోలీలో ప్రయాణాలు చేస్తూ ప్రాణాలు కాపాడుకుంటారు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. కొెండల్లోని వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇన్నిరోజులు వాటిపైనుంచి దాటేవారు. ఇప్పుడు వాగులు ఉప్పొంగడటంతో..వారు ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ మన్యంలో వరదల్లో నిండు గర్భిణి చిక్కుకుంది. డోలీ వాగులోనే పడిపోవడంతో.. కోరుకొండ పీహెచ్‌సీకి తరలించేందుకు కుటుంబ సభ్యులు కష్టాలుపడ్డారు. ఎండిన చెట్టు సాయంతో ఆమెను గడ్డెకి ఎక్కించారు.
విశాఖ మన్యం చింతపల్లి మండలం బలపం పంచాయతీ బూరుగుబయలు నుంచి ఓ బాలింతను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అతికష్టం మీద వాగును దాటించారు. గ్రామానికి చెందిన వూలంగి విజయలక్ష్మి(28) ఆడ శిశువుకు జన్మనిచ్చింది. బాలింత నిరసంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఆమెను, శిశువుని కోరుకొండ పీహెచ్‌సీకి తరలించేందుకు డోలిలో మోసుకెళ్లారు. బూరుగుబయలు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో.. గ్రామానికి అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు. దీంతో కుటుంబసభ్యులు నడుములోతులో ప్రవహిస్తున్న వాగును అతి కష్టంపై దాటించాలనుకున్నారు.