ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు సౌకర్యం లేక.. పాడేరు ఏజెన్సీలో మరో గర్భిణీ మృతి - రోడ్డు సదుపాయం లేక గర్భిణీ మృతి

రహదారి సౌకర్యం లేక.. విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో గర్భిణులు మృతి చెందడం పరిపాటిగా మారింది. సరైన రోడ్డు మార్గం లేకపోవడం వల్ల.. జి.మాడుగుల మండలం అడ్డులులో ఓ నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయింది.

pregnant died lack of road facility in paderu
పాడేరు ఏజెన్సీలో మరో గర్భిణీ మృతి

By

Published : May 18, 2021, 6:22 PM IST

విశాఖ పాడేరు ఏజెన్సీలో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీని.. కొండమార్గంలో ఆస్పత్రికి తీసుకువస్తుండగా మృతి చెందింది. జి.మాడుగుల మండలం అడ్డులు గ్రామానికి చెందిన ఈశ్వరమ్మకు.. సోమవారం అర్థరాత్రి పురిటి నొప్పులు మొదలయ్యాయి. కుటుంబీకులు ఆమెను జి.మాడుగుల ఆస్పత్రికి తరలించేందుకు 108కు సమాచారం ఇచ్చారు. రహదారి సౌకర్యం లేక ఆ వాహనం గ్రామానికి చేరుకోలేదు.

ఇదీ చదవండి:'రాక్ గార్డెన్' అందాలు చూడతరమా!

తప్పనిసరి పరిస్థితుల్లో గర్భిణిని డోలీలో మోసుకుని వస్తుండగా.. మార్గం మధ్యలో ఆమె ప్రాణాలు వదిలింది. స్థానిక ఆరోగ్య కార్యకర్త సైతం సకాలంలో వచ్చి చికిత్స అందించలేదని కుటుంబీకులు వాపోతున్నారు. రహదారి సౌకర్యం లేకే తమకు ఈ దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:మాడుగులలో కొవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details