ప్రసవం కోసమని ఆసుపత్రికి వెళ్తున్న ఓ నిండు గర్భణి.. బైక్ ఫీడర్ అంబులెన్స్‌లో రోడ్డుపైనే ప్రసవించింది. ఈ సంఘటన విశాఖ ఏజెన్సీ హుకుంపేట మండలం కొట్టనాపల్లి వద్ద జరిగింది. రంగశీల పంచాయతీ బలురోడలకు చెందిన లలిత కుమారి అనే గర్భణి.. ప్రసవ నొప్పులతో బాధపడుతుండగా.. బైక్ అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. బలులోడ నుంచి కొట్టనాపల్లి వద్దకు వచ్చేసరికి నొప్పులు అధికమయ్యాయి. బైక్ అంబులెన్స్‌లోనే రహదారి పక్కన పాపకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డలను హుకుంపేట ఆసుపత్రికి తరలించారు. ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రసవం కోసమని ముందుగానే జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని వైద్యులు తెలిపారు.
రహదారే ప్రసవ స్థలం.. బైక్ అంబులెన్స్‌లో కాన్పు
నిండు గర్భణి.. బైక్ ఫీడర్ అంబులెన్స్‌లో ప్రసవించింది. విశాఖ ఏజెన్సీ ప్రాంతమైన కొట్టనాపల్లి వద్ద ఈ ఘటన జరిగంది. ప్రస్తుతం తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
రోడ్డు పక్కనే ప్రసవించిన ఏజెన్సీ మహిళ