ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాయరావుపేటలో భారీ వర్షం.. సేదతీరిన ప్రజలు - వర్షం

విశాఖ జిల్లా పాయకరావుపేటలో భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచి బురదమయం అయ్యాయి.

పాయరావుపేటలో భారీ వర్షం..సేదతీరిన ప్రజలు

By

Published : Jun 8, 2019, 6:55 PM IST

పాయరావుపేటలో భారీ వర్షం..సేదతీరిన ప్రజలు

విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో ఒక్కసారిగా వాతావరణం మారి.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. గంటపాటు కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రహదారులపై నీరు నిలిచింది. వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. నాగరాజు పేట, ముస్లిం కాలనీ, బస్ స్టాండ్ ఏరియా ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచి, బురదమయంగా మారాయి. వాతావరణం చల్లబడి ప్రజలు సేదతీరారు.

ABOUT THE AUTHOR

...view details