రాష్ట్రం అంతటా జోరుగా వర్షాలు కురుస్తున్నా.. విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో వర్షం మొఖం చాటేసింది. పలు గ్రామాల్లో సాగునీరు అందక వరినాట్లు వేయని పరిస్థితి. మరికొన్ని గ్రామాల్లో వేసిన వరినాట్లును రక్షించుకునే రైతులు అవస్థలు పడుతున్నారు. చోడవరం నియోజకవర్గంలో వర్షాల కురవాలని పలుచోట్ల వరుణ్ని పూజిస్తున్నారు. లక్కవరం గ్రామ ప్రజలు వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు జరిపించారు.
వర్షం కురవాలని లక్కవరంలో పూజలు - చోడవరంలో లేని వర్షాలు
విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం లక్కవరం గ్రామంలో వర్షాలు కురవాలని ప్రజలు పూజలు చేశారు. లక్కవరంలోని పురాతనమైన ఉమాభీమా లింగశ్వేర ఆలయంలో సోమవారం ఆరున్నర గంటల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు
![వర్షం కురవాలని లక్కవరంలో పూజలు prayers for rains at lakkavaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8793871-252-8793871-1600068836554.jpg)
వర్షం కురవాలని లక్కవరంలో పూజలు
లక్కవరంలోని పురాతనమైన ఉమాభీమా లింగశ్వేర ఆలయంలో సోమవారం ఆరున్నర గంటల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివ లింగాన్ని పంచామృతాలతో అభిషేకించారు. వెయ్యి బిందెల నీళ్లతో జలాభిషేకం నిర్వహించారు.
ఇదీ చదవండి: సీఎం కాన్ఫరెన్స్‌కు ఆహ్వానించారు.. అంతలోనే రావద్దన్నారు!