పోలీసులంటే అనుక్షణం నేరస్థులను పట్టుకొని కఠినత్వంతో కూడిన మనసు కాదు వారిలోనూ మానవత్వం ఉందని చాటిచెప్పారు విశాఖ జిల్లా శంకరం పంచాయితీ పోలీసులు. రక్షకభటులు అనే నామాన్ని చిరస్థాయిగా నిలిపారు. ఓ నిండు గర్భిణీ ప్రసవ నొప్పులతో బాధపడుతుంది. 108కి ఫోన్ సమాచారం ఇచ్చినా రహదారి సదుపాయం సరిగ్గా లేదు. అంబులెన్స్ సమయానికి రాలేదు. నొప్పులు అంతకంతకూ పెరిగాయి. ఉమ్మనీరు కడుపులోంచి తరిగిపోతుంది. ఆ క్షణంలో ఆ ఆదివాసీలకు దిక్కే లేదు. కాని అక్కడ ఉన్నవారికి సమస్య పరిష్కరించగలవారు ఒక్కరేనని అనుకున్నారు. వారే పోలీసులు. తక్షణం సమాచారం ఇచ్చారు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఎస్సై తారకేశ్వరరావు గ్రామానికి చేరుకొని పోలీసులు జీపులో ఆమెను మాడుగుల మండలం కె.జె.పురం పి.హెచ్.సికి తరలించారు. అనంతరం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. డీఎస్పీ శ్రావణి సహకారంతో ఎన్టీఆర్‌లో చికిత్స నిర్వహించారు. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షమంగా ఉన్నారు రక్షక భటులు చేసిన సేవలకు గ్రామస్థులు ధన్యవాదాలు తెలిపారు. పోలీసులు ఆమెకు తన బిడ్డకు పునర్జన్మను ప్రసాదించారు.
పోలీసు జీపులో ప్రసవానికి... తల్లీ బిడ్డా క్షేమం... - madugula mandal
విశాఖ జిల్లా శంకరం పంచాయితీలో నిండుగర్భిణీ ప్రసవ నొప్పులతో ఇబ్బందిపడుతుంది. అంబులాన్స్ సరైన సమయంలో రాలేదు. దీంతో గ్రామస్థులు ఎస్.ఐ కు సమాచారం అందించారు. పోలీసులు వారి జీపులో సరైన సమయానికి ఆసుపత్రిలో చేర్చి తల్లిని, బిడ్డని కాపాడి వారి మానవత్వాన్ని చాటుకున్నారు.
మానవత్వం చాటిన రక్షకుడు