ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో పెనుగాలులు.. విద్యుత్ సరఫరాకు అంతరాయం - Heavy winds in Visakhapatnam district

విశాఖ జిల్లా దేవరాపల్లి, చీడికాడ మండలాల్లో నిన్న సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈ కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తెగిపడి.. ఆయా ప్రాంతాల్లో చీకట్లు కమ్ముకున్నాయి.

విశాఖ జిల్లాలో భారీగా వీచిన గాలులు
విశాఖ జిల్లాలో భారీగా వీచిన గాలులు

By

Published : May 30, 2021, 9:50 AM IST

విశాఖ జిల్లా దేవరాపల్లి, చీడికాడ మండలాల్లో విస్త్రతంగా ఈదురుగాలులు వీచాయి. చెట్లు, కొమ్మలు విరిగిపడటంతో విద్యుత్ స్తంభాలు పదుల సంఖ్యలో కూలిపోయాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తెగిపడి.. వాటిపై చెట్లు కొమ్మలు, తాటిమట్టలు చిక్కుకున్నాయి. వర్షం తగ్గిన వెంటనే విద్యుత్ సిబ్బంది క్షేత్రస్థాయిలో మరమ్మతులకు రంగంలోకి దిగారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details