విశాఖ జిల్లా సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో గురువారం సాయంత్రం నుంచి మొదటి యూనిట్ ద్వారా విద్యుదుత్పత్తి ప్రారంభించారు. ఫిబ్రవరి 15న మొదటి యూనిట్లో సమస్య రావడంతో విద్యుదుత్పత్తి నిలిపేశారు. జెన్కో అధికారులు స్పందించి... కేరళకు చెందిన ఫిటెన్‌స్ కంపెనీతో మరమ్మతులు చేయించారు. మరమ్మతులు గత శుక్రవారంతోనే పూర్తయినప్పటికీ... కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని గుర్తించారు. బెంగుళూరుకు చెందిన ఏబీబీ, బెలగాంకు చెందిన సర్వో ఇంజినీర్సు కంపెనీ ప్రతినిధులు వచ్చి సాంకేతికలోపాలు సరిద్దడంతో... గురువారం సాయంత్రం నుంచి విద్యుదుత్పత్తి ప్రారంభించారు.
సీలేరులో విద్యుదుత్పత్తి ప్రారంభం - సీలేరు
సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. మరమ్మతుల అనంతరం మళ్లీ విద్యుదుత్పత్తి ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
సీలేరు జలవిద్యుత్ కేంద్రం