ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీలేరు కాంప్లెక్సు జలవిద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిపివేత - sileru complex latest news

విశాఖ జిల్లా సీలేరు కాంప్లెక్సులోని జలవిద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పత్తిని నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. పోల‌వ‌రంప్రాజెక్టు కాపర్‌ డ్యామ్‌ పనులు జరగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

hydropower plants
జలవిద్యుత్ కేంద్రం

By

Published : May 14, 2021, 7:59 PM IST

విశాఖ జిల్లా సీలేరు కాంప్లెక్సు జలవిద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పత్తిని నిలిపివేశారు. పోల‌వ‌రంప్రాజెక్టులో కాపర్‌ డ్యామ్‌ పనులు జరగుతుండటంతో… ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానికాధికారులు తెలిపారు. మాచ్‌ఖండ్‌, సీలేరు, డొంకరాయి, పొల్లూరు కేంద్రాల్లో ఈ నెల 25వ తేదీ వరకు విద్యుత్‌ ఉత్పత్తి జరగదని స్పష్టం చేశారు.

సీలేరు కాంప్లెక్స్‌లోని నాలుగు జ‌ల‌విద్యుత్కేంద్రాల ద్వారా 845 మెగావాట్లు విద్య‌దుత్ప‌త్తి జ‌రుగుతుంది. అనంత‌రం విడుద‌లైన నీరు శ‌బ‌రి ద్వారా గోదావ‌రిలోకి క‌లుస్తుంది. ఈ నీరు పోల‌వ‌రం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకోవ‌డం వ‌ల్ల అక్క‌డ కాప‌ర్ డ్యాం ప‌నుల‌కు అడ్డంకిగా మారే అవ‌కాశ‌ముంది. దానికి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఉండేందుకు విద్యుదుత్ప‌త్తి నిలిపివేస్తామ‌ని జెన్‌కో ఎస్ఈ రామ‌కోటిలింగేశ్వ‌ర‌రావు తెలిపారు.

ఇదీ చదవండి:మాచ్​ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్​ ఉత్పత్తి

ABOUT THE AUTHOR

...view details