ఆంధ్రాా- ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో రికార్డు స్థాయిలో 102 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. ఇరు రాష్ట్రాల్లోనూ ఇది అత్యంత పురాతన విద్యుత్ కేంద్రం. అక్కడున్న ఆరింటిలో.. మూడు జనరేటర్లు మాత్రమే పనిచేస్తాయి. ఈ నెల ప్రాజెక్టులో… ఐదు జనరేటర్ల సాయంలో 102 మెగా వాట్ల ఉత్పత్తి జరిగింది. 2013 తర్వాత మళ్లీ ఇప్పుడు వంద మెగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి జరిగిందని ప్రాజెక్టు ఇంఛార్జి ఎస్ఈ రమణయ్య అన్నారు. ఇందు కోసం కృషి చేసిన ఇంజినీర్లు, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.
మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి - visakha district latest news
విశాఖలో ఉన్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో రికార్డు స్థాయిలో ఉత్పత్తి జరిపారు. ఇందు కోసం కృషి చేసిన ఇంజినీర్లు, ఉద్యోగులను ఎస్ఈ రమణయ్య అభినందించారు.
మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం