విశాఖ సీలేరు కాంప్లెక్స్‌లో డొంకరాయి జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. ఆగష్టు 11న డొంకరాయి పవర్ కెనాల్‌కు గండిపడి జెన్కోకి నష్టం వాటిల్లింది. అయితే జెన్కో అధికారులు పవర్ కెనాల్ నుంచి నీటి విడుదల నిలిపివేసి జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. వాతావరణం అనుకూలించకపోవటంతో పెద్ద ఎత్తున వర్షాలు పడటంతో గండి పూడ్చే పనులకు ఆటంకం కలిగింది. అధికారులు రేయింబవళ్లు శ్రమించటంతో ఈ నెల 16 నాటికి పనులు పూర్తయ్యాయి. దీంతో పవర్ కెనాల్ నుంచి నీటి విడుదల ప్రారంభించారు. ప్రస్తుతం 17 మెగావాట్ల లోడుతో విద్యుత్ ఉత్పత్తి అధికారులు చేస్తున్నారు. పవర్ కెనాల్ ద్వారా 11.5 అడుగుల మేరకు నీటిని విడుదుల చేస్తున్నట్లు జెన్కో అధికారులు తెలిపారు.
డొంకరాయి జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి - విశాఖ సీలేరు కాంప్లెక్స్‌లో డొంకరాయి జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి
విశాఖ సీలేరు కాంప్లెక్స్‌లో డొంకరాయి జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు.
డొంకరాయి జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి