విశాఖ జిల్లా చీడికాడ మండలం ఎల్.బీ. పట్నంలో వంద ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం కలిగిన అప్పలరాజు సాగునీటి చెరువు ఉంది. ఈ చెరువులో కొన్నాళ్లుగా చేపల పెంపకందారులు కోళ్ల వ్యర్ధాలు కలుపుతున్నారు. దీంతో చెరువులో నీరంతా కలుషితం అవుతోంది.
ఈ నీరు తాగిన పశువులు రోగాల బారిన పడుతున్నాయని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువు నీటిని పంటలకు మళ్లించినప్పుడు శరీరమంతా దురదగా మారుతోందని రైతులు మండిపడుతున్నారు. ఈ విషయంపై చెరువు గట్టువద్ద నిరసన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి.. చెరువులో చేపల పెంపకానికి ఎవరూ కోళ్ల వ్యర్ధాలు వేయకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.