ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జనభా పెరుగుదలపై పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..! - world population day

జనాభా పెరుగుదల.. ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఇదీ ఒకటి. చైనా, భారత్ ఎక్కువ జనాభా గల దేశాల్లో ముందున్నాయి. రానున్న రోజుల్లో చైనాను... భారత్ మించి పోయేలా ఉంది. విశాఖ ఆంధ్ర విశ్వ విద్యాలయం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా... జనాభా పెరుగుదలఫై పరిశోధనలను బయట పెట్టింది.

'పెరుగుతున్న జనాభా మంచా? చెడా?'

By

Published : Jul 11, 2019, 10:39 PM IST

ప్రస్తుతం 134 కోట్ల జనాభాతో ఉన్న భారత్ 2027 నాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించబోతోందని పరిశోధనలు అంటున్నాయి. యువత అధికంగా కలిగి, భారత్ అభివృద్ధి చెందిన దేశం అవుతుందని చెబుతున్నారు. యూరప్ లాంటి దేశాల్లో వయో వృద్ధులు అధికమై, యువత తగ్గిపోతున్న తరుణంలో ప్రపంచ దేశాలకు సర్వీస్ సెక్టార్​లో భారత్ ఒక ప్రధాన వనరుగా ఉంటుందని అంటున్నారు.

పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అంటున్నారు నిపుణులు. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. భారతీయుల్లో సంతాన ఉత్పత్తి శాతం తగ్గుతోంది. దీని వల్ల భవిష్యత్​లో అనేక ఇబ్బందులు వస్తాయని పరిశోధనల్లో తేలింది. ప్రస్తుతానికి స్వీడెన్, జపాన్ వంటి దేశాలు జనాభా పెరుగుదలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయని, మన దేశంలో అలాంటి సమస్యలు లేవని విశ్వవిద్యాలయం వెల్లడించిన పరిశోధనలో తేలింది.

పెరుగుతున్న జనాభా మంచా? చెడా?

ABOUT THE AUTHOR

...view details